భారతదేశం, డిసెంబర్ 29 -- ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాలకు గుండెపోటు ప్రధాన కారణమని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ఏటా సుమారు 1.79 కోట్ల మంది గుండె సంబంధిత వ్యాధులతో (CVD) కన్నుమూస్తున్నారు. ఇందులో ఐదుగురిలో నలుగురు గుండెపోటు లేదా స్ట్రోక్ వల్లే మరణిస్తున్నారు. రక్తనాళాలు పూడుకుపోవడం లేదా కుంచించుకుపోవడమే ఈ ప్రాణాంతక పరిస్థితులకు ముఖ్య కారణం. అందుకే, రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే ప్రక్రియను ప్రారంభంలోనే గుర్తించడం అత్యంత కీలకం.

రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్ని వైద్య పరిభాషలో 'అథెరోస్క్లెరోసిస్' అంటారు. దీనిపై న్యూఢిల్లీలోని ఐఎస్ఐసి (ISIC) మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కార్డియాలజీ హెడ్ డాక్టర్ సౌరభ్ జునేజా వివరిస్తూ.. "అథెరోస్క్లెరోసిస్ అనేది ఒక మొండి శత్రువు. రక్తనాళాల లోపలి పొరల్లో ప్లేక్ (కొవ్వు, ఇతర పదార...