భారతదేశం, అక్టోబర్ 27 -- గుండె జబ్బులు (Heart Disease) ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలలో ఒకటిగా ఉన్నాయి. చాలా మందిలో, ముఖ్యమైన లక్షణాలు కనిపించకముందే ఈ సమస్య సైలెంట్‌గా అభివృద్ధి చెందుతుంది. అందుకే, ప్రారంభంలోనే సమస్యను గుర్తించడం చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో, కార్డియోవాస్కులర్ రీసెర్చ్ సైంటిస్ట్, im8health సంస్థలో చీఫ్ న్యూట్రిషన్ ఆఫీసర్‌గా ఉన్న డాక్టర్ జేమ్స్ డినికలంటోనియో... ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన గుండె జబ్బుల మూడు ప్రారంభ హెచ్చరిక సంకేతాలను తన అక్టోబర్ 24 ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పంచుకున్నారు.

"గుండె జబ్బులు ఉన్న వారిలో సుమారు సగం మందికి అంగస్తంభన సమస్యలు ఉంటాయి. గుండె జబ్బులు వచ్చే ఐదేళ్ల ముందు కూడా ఈ సమస్య మొదలవ్వచ్చు" అని డాక్టర్ డినికొలంటోనియో వివరించారు. పురుషాంగం ధమనులలో రక్త ప్రవాహం తగ్గడం, ప్లేక్ పేరుకుపోవడం వల్లే ఇద...