భారతదేశం, నవంబర్ 11 -- భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధుల (CVD) కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ నివేదిక ప్రకారం, 2021లో మన దేశంలో గుండె సంబంధిత సమస్యల వల్ల 28,73,266 మంది ప్రాణాలు కోల్పోయారు. 2021 నుండి 2023 మధ్య జరిగిన మొత్తం మరణాల్లో దాదాపు మూడో వంతుకు గుండెపోట్లే ప్రధాన కారణంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, గుండెపోటు లేదా స్ట్రోక్ ముప్పును తగ్గించుకోవడానికి జీవనశైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరం.

ఢిల్లీలోని ద్వారకకు చెందిన సీనియర్ డయాబెటాలజిస్ట్, 24 ఏళ్ల అనుభవం ఉన్న ఫిజీషియన్ డా. బ్రిజ్‌మోహన్ అరోరా గుండె పోటు ముప్పును తగ్గించేందుకు ఒక అత్యంత సులభమైన మార్గాన్ని సూచించారు.

భోజనం తర్వాత నడవాల్సిన ప్రాధాన్యతను వివరిస్తూ, ఈ అలవాటుతో గుండె పోటు ముప్పు ఏకంగా 40% వరకు తగ్గుతుం...