భారతదేశం, ఆగస్టు 22 -- గుండెపోటు లేదా స్ట్రోక్ ముప్పు నివారించడానికి ధమనుల్లో పూడిక లక్షణాలను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం. ధమనులు పూడుకుపోవడం అంటే కేవలం గుండెలో నొప్పి రావడం మాత్రమే కాదు. ఇంకా చాలా రకాలుగా ఆ లక్షణాలు బయటపడతాయని ఒక సర్జన్ అంటున్నారు. తీవ్రమైన సమస్యలు రాకుండా ఉండాలంటే ఆ హెచ్చరికలను గుర్తించడం తప్పనిసరి అని ఆయన చెబుతున్నారు. వాస్కులర్ సర్జన్, వేరికోస్ వెయిన్స్ నిపుణుడు అయిన డాక్టర్ సుమిత్ కపాడియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ఆగస్టు 1న దీని గురించి ఒక పోస్ట్ షేర్ చేశారు.

"ఎంతో మంది రోగులకు చికిత్స చేసిన తర్వాత, నాకు అనిపించింది ఏంటంటే... ఆలస్యం కాకముందే చాలా మందికి ఈ విషయాలు తెలిసి ఉంటే బాగుండు అని" అంటూ డాక్టర్ కపాడియా చెప్పారు. గుండె నొప్పి కాకుండా కూడా ధమనుల పూడికకు అనేక లక్షణాలుంటాయని, ఈ హెచ్చరికలపై దృష్టి పెట్టడం చాల...