భారతదేశం, జూన్ 19 -- మౌనిక ముందు బ్యాగ్ తీసుకొచ్చి పెడుతుంది సువ‌ర్ణ‌. ఈ న‌ర‌కం నుంచి శాశ్వ‌తంగా పుట్టింటికి వెళ్లిపోమ‌ని అంటుంది. సంజు మార‌డం అసాధ్య‌మ‌ని చెబుతుంది. సువ‌ర్ణ మాట‌ల‌తో మౌనిక షాక‌వుతుంది. నేను కూడా ఓ దుర్మార్గుడిని పెళ్లిచేసుకొని ఎన్నో క‌ష్టాలు అనుభ‌వించాన‌ని, సంజు కూడా తండ్రిలాగే త‌యార‌య్యాడ‌ని అంటుంది. సంజును మ‌ర్చిపోయి మ‌రో పెళ్లిచేసుకోమ‌ని మౌనిక‌కు స‌ల‌హా ఇస్తుంది సువ‌ర్ణ‌.

తాను ఇళ్లు వ‌దిలి వెళ్ల‌న‌ని, భ‌ర్త‌ను మార్చుకోవ‌డానికి కావాల్సినంత స‌హ‌నం, ఓర్పు త‌న‌కు ఉన్నాయ‌ని అత్త‌య్య‌తో అంటుంది మౌనిక‌. బాలు కూడా మీనాను ఇష్టంలేకుండానే పెళ్లిచేసుకున్నాడ‌ని, కానీ ఇప్పుడు ఇద్ద‌రు సంతోషంగా ఉన్నార‌ని, త‌న కాపురంలో అలాంటి రోజులు వ‌స్తాయ‌నే ఆశ ఉంద‌ని మౌనిక అంటుంది.

తాను ఇంట్లో నుంచి బ‌య‌ట అడుగుపెట్టిన మ‌రుక్ష‌ణం సంజును బాలు ప్రాణా...