భారతదేశం, జూలై 1 -- తాళిబొట్టు మార్చే ఫంక్ష‌న్‌ను రోహిణితో మొద‌లుపెట్టాల‌ని ప్ర‌భావ‌తి అనుకుంటుంది. రోహిణి తండ్రి రాక‌పోవ‌డంతో ఆమె టెన్ష‌న్ పెరిగిపోతుంది. ఫంక్ష‌న్‌లో ఏదో గొడ‌వ జ‌రుగుతుంద‌ని నా సిక్త్స్ సెన్స్ చెబుతుంద‌ని శృతితో ర‌వి అంటాడు. మా అమ్మ నాన్న ఇంత‌కుముందులా లేర‌ని, మారిపోయార‌ని త‌ల్లిదండ్రుల‌ను వెన‌కేసుకు వ‌స్తుంది శృతి. ఏ గొడ‌వ జ‌ర‌గ‌కుండా తాను మ్యానేజ్ చేస్తాన‌ని భ‌ర్త‌కు మాటిస్తుంది.

బాలు సైగ‌ల‌తో మీనాకు ఏదో చెబుతాడు. భ‌ర్త ఏం చెబుతున్నాడో మీనాకు అర్థం కాదు. బాలు సైగ‌ల‌కు తాను అర్థం చెబుతాన‌ని కామాక్షి అంటుంది. అంద‌రిని కొట్టేసి ర‌మ్మంటున్నావా...ర‌వి వాళ్ల అత్త బాగా తిని తెగ లావైపోయింద‌ని చెబుతున్నావు అంటూ బాలు అన్న మాట‌ల‌ను పూర్తిగా మార్చేసి చెబుతుంది. దాంతో బాలు త‌ల ప‌ట్టుకుంటాడు.

పూల మాల విష‌యంలో పెద్ద గొడ‌వ జ‌రుగుతుంద...