భారతదేశం, జూన్ 17 -- బాలు కోసం కారు కొంటుంది మీనా. గుడిలో పూజ జ‌రిగే వ‌ర‌కు అది తానే కొనిచ్చిన విష‌యం బాలు ద‌గ్గ‌ర దాచిపెడుతుంది. కారు ఓన‌ర్‌వి నువ్వేన‌ని, నీ కోస‌మే మీనా ఈ కారు కొన్న‌ద‌ని బాలుతో పూజారి చెబుతాడు.

కారు ఓన‌ర్‌గా చూసిన మిమ్మ‌ల్ని ఆటో డ్రైవ‌ర్‌గా చూడ‌లేక‌పోయాన‌ని, మీ కోస‌మే ఈ కారు కొన్నాన‌ని మీనా అంటుంది. పూల మాల‌ల ఆర్డ‌ర్ ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తోనే కారు కొన్నాన‌ని చెబుతాడు. మీనా మాట‌ల‌తో బాలు ఎమోష‌న‌ల్ అవుతాడు.

పూజ పూర్త‌యిన త‌ర్వాత బాలుకు కారు కీస్ ఇస్తుంది మీనా. కారు తీయండి ఓన‌ర్ కారు...న‌న్ను మా అత్త‌గారి ఇంటి ద‌గ్గ‌ర దించండి. బోణి డ‌బ్బులు నేను ఇస్తాన‌ని మీనా అంటుంది. కారు బాగుంద‌ని బాలు అంటాడు. బాలు మౌనంగా ఉంటాడు. ఏమైంద‌ని మీనా అంటుంది. చాలా సంతోషంగా ఉన్నాన‌ని, అందుకే మాట‌లు రావ‌డం లేద‌ని చెబుతాడు.

మిమ్మ‌ల్ని ఎవ‌రూ ...