భారతదేశం, జూన్ 26 -- శృతి ఫంక్ష‌న్‌కు సంజు, మౌనిక‌ల‌ను పిల‌వాల‌ని నీల‌కంఠం ఇంటికి వ‌స్తారు ప్ర‌భావ‌తి, స‌త్యం. వారి ముందు త‌మ అస‌లు రంగు బ‌య‌ట‌పెడ‌తారు సంజు, నీల‌కంఠం. ఎలా ఉన్నావ‌ని మౌనిక‌ను అడుగుతుంది ప్ర‌భావ‌తి.మౌనిక‌ను రోజుకో ర‌కం టార్చ‌ర్ పెడుతున్నాను.

మీ అమ్మాయి మా ఇంట్లో ఎందుకు బాగుంటుంది అని సంజు తిక్క‌తిక్క‌గా బ‌దులిస్తాడు. మౌనిక ఒంటిపై న‌గ‌లేమి లేకుండా బోసిగా క‌నిపిస్తుంది. న‌గ‌లు ఏమ‌య్యాయ‌ని ప్ర‌భావ‌తి అడుగుతుంది. బంగారం రేటు పెరిగింద‌ని మేమే అమ్మేశామ‌ని సంజు బ‌దులిస్తాడు. సంజు మాట‌ల‌తో స‌త్యం, ప్ర‌భావ‌తి బాధ‌ప‌డ‌తారు. సింపుల్‌గా ఉండ‌ట‌మే నాకు ఇష్టం మౌనిక క‌వ‌ర్ చేస్తుంది.

శృతి, రోహిణి న‌ల్ల‌పూస‌ల ఫంక్ష‌న్‌కు పిల‌వ‌డానికి వ‌చ్చామ‌ని సంజుతో ప్ర‌భావ‌తి అంటుంది. శృతి అంటే నాతో పెళ్లి ఫిక్సైన త‌ర్వాత వీళ్ల అబ్బాయితో లేచిపోయింది ఆమ...