భారతదేశం, జూలై 2 -- బాలును అడ్డుపెట్టుకొని ఫంక్ష‌న్‌లో గొడ‌వ‌లు చేయాల‌ని శోభ‌న‌, రోహిణి స్కెచ్ వేస్తారు. బాలుకు కోపం తెప్పించేందుకు శోభ‌న మ‌నుషులు ప్ర‌య‌త్నిస్తారు. బాలును కొడ‌తారు. మీనాకు ఇచ్చిన మాట కోసం వారిని ఏం అన‌కుండా వ‌దిలేస్తాడు బాలు. బుద్దిగా బాలు కూర్చోవ‌డం చూసి రంగా ఆశ్చ‌ర్య‌పోతాడు. వంద మందిని కొట్టేవాడు కూడా ఒక్క నీ మాట‌కు క‌ట్టుబ‌డి సైలెంట్ అయిపోయాడు...వీడు నీ అస‌లైన కొడుకు అని స‌త్యంతో అంటాడు రంగా.

ఫంక్ష‌న్‌లో ప‌నులు చేయ‌డానికి మీనాను త‌న రూమ్ లోప‌లికి ర‌మ్మ‌ని అంటుంది ప్ర‌భావ‌తి. మీనా వెళ్ల‌డానికి బాలు ఒప్పుకోడు. త‌న‌ను వ‌దిలిపెట్టి వెళ్లొద్ద‌ని, ఫంక్ష‌న్‌తో నాతో గొడ‌వ ప‌డాల‌ని కొంద‌రు చూస్తున్నార‌ని, నువ్వు ప‌క్క‌న ఉంటేనే నాకు ధైర్యం అంటాడు. తాను వెంట‌నే వ‌చ్చేస్తాన‌ని మీనా వెళ్లిపోతుంది.

బాలు ఇరిటేట్ చేయ‌డానికి మ‌ళ్లీ శ...