భారతదేశం, జూన్ 11 -- బాలు, మీనాల‌పై రివేంజ్ తీర్చుకోవ‌డానికి పూల మాల‌ల ట్ర‌క్‌ను త‌న మ‌నుషుల‌తో దొంగ‌త‌నం చేయిస్తాడు గుణ‌. ఆ ట్ర‌క్‌లోని పూల మాల‌లు కాల్చేయాల‌ని అనుకుంటాడు. కానీ రాజేష్‌తో పాటు మ‌రికొంత మంది స్నేహితుల‌ స‌హాయంతో ఆ ట్ర‌క్‌ను ప‌ట్టుకుంటారు బాలు, మీనా. మీతో ఎవ‌రు ఈ ప‌ని చేయించారో చెప్ప‌మ‌ని గుణ గ్యాంగ్ మెంబ‌ర్స్‌ను చిత‌క్కొడ‌తాడు బాలు. పూల మాల‌లు డెలివ‌రీ చేసేందుకు టైమ్ అయ్యింద‌ని, అదే మ‌న‌కు ముఖ్య‌మ‌ని మీనా, రాజేష్ అన‌డంతో గుణ మ‌నిషిని బాలు వ‌దిలేస్తాడు.

పొలిటిక‌ల్ లీడ‌ర్ వీర‌బాబుకు ఫోన్ చేసి ట్ర‌క్ దొరికింద‌ని, ప‌ది నిమిషాల్లో ఫంక్ష‌న్ హాల్‌కు వ‌స్తామ‌ని బాలు అంటాడు. బాలు రాగానే త‌న మ‌నుషుల‌తో బాలును బందిస్తాడు వీర‌బాబు. ప్ర‌త్య‌ర్థుల‌తో చేతులు క‌లిపి త‌న పేరును నాశ‌నం చేయ‌డానికే బాలు కుట్ర‌లు ప‌న్నాడ‌ని వీర‌బాబు నింద‌లు వే...