భారతదేశం, మే 9 -- బాలు త‌న‌ను తాగేసి కొట్టాడ‌ని అబ‌ద్ధం చెబుతాడు శివ‌. అత‌డి మాట‌లు నిజ‌మ‌ని న‌మ్మిన మీనా బాలును నిల‌దీస్తుంది. శివ దొంగ‌త‌నం చేశాడ‌నే నిజం మీనా ద‌గ్గ‌ర దాచి భార్య దృష్టిలో చెడ్డ‌వాడిగా మిగిలిపోతాడు బాలు.

శివ చేయిని బాలు విరిచేశాడ‌నే నిజం స‌త్యం, ప్ర‌భావ‌తితో పాటు మిగిలిన కుటుంబ‌స‌భ్యుల‌కు చెబుతుంది మీనా. క‌న్నీళ్లు పెట్టుకుంటుంది. ఆమెను రోహిణి, శృతి ఓదార్చుతారు.

బాలు ఇలా చేశాడంటే షాకింగ్‌గా ఉంద‌ని శృతి అంటుంది. మాట‌లు అన‌డం ఓకే కానీ ఇలా చేతుల‌, కాళ్లు విరిచేయ‌డం ఏంటి రోహిణి ఫైర్ అవుతుంది. బాలుకు ఇదేం కొత్త కాద‌ని, త‌న రెండు చేయి వేళ్లు విరిచేశాడ‌ని మ‌నోజ్ అంటాడు.

శివ చేయ‌కూడ‌ని త‌ప్పు ఏదో చేసి ఉండొచ్చ‌ని బాలును స‌పోర్ట్ చేస్తుంది ప్ర‌భావ‌తి. శివ‌...గుణ ద‌గ్గ‌ర ప‌నిచేస్తున్నాడ‌ని, వ‌డ్డీ డ‌బ్బుల కోసం జ‌రిగిన గొడ‌వ‌లో గు...