భారతదేశం, ఏప్రిల్ 30 -- నిద్ర‌లో టిఫిన్ పేర్లు క‌ల‌వ‌రిస్తాడు మ‌నోజ్‌. ఆర్డ‌ర్ తీసుకుంటున్న‌ట్లు అరుస్తాడు. అది చూసి రోహిణి కంగారు ప‌డుతుంది. మ‌నోజ్‌ను నిద్ర‌లేపుతుంది. హోట‌ల్‌లో వెయిట‌ర్‌లా ఫుడ్స్ పేర్లు చెబుతున్నావేంటి అని అనుమానంగా అడుగుతుంది. దొరికిపోయాన‌ని మ‌నోజ్ కంగారు ప‌డ‌తాడు. నేను ఫుడ్ ఆర్డ‌ర్ తీసుకోవ‌డమేంటి? నువ్వేదో పొర‌పాటుగా విన్నావ‌ని బుకాయిస్తాడు.

ఉద‌యం ఒక చోట టిఫిన్ చేద్దామ‌ని ఓ హోట‌ల్‌కు వెళ్లాన‌ని, అక్క‌డి క‌పుల్ దోశ బాగుంద‌ని, కానీ నీతోనే తినాల‌ని కేవ‌లం ఇడ్లీ మాత్ర‌మే తిని వ‌చ్చేశాన‌ని అంటాడు. ఆ కోరిక అలాగే ఉండి క‌ల‌వ‌రించి ఉంటాన‌ని అబ‌ద్ధం ఆడుతాడు మ‌నోజ్‌. అప్పుడు ఒక్క దోశ పేరు చెప్పాలి కానీ అన్ని టిఫిన్స్ పేరు ఎందుకు క‌ల‌వ‌రించావ‌ని లాజిక్‌తో కొడుతుంది రోహిణి. నాకు కావాల్సిన దానితో పాటు చుట్టూ ఉన్న వాటి పేర్లు కూడా ...