భారతదేశం, జూన్ 10 -- పూల దండ‌లు క‌ట్ట‌డానికి వ‌చ్చిన వాళ్ల‌తో పాటు ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రూ నిద్ర‌పోతారు. మీనా మాత్రం భ‌ర్త మాట పోకూడ‌ద‌ని రాత్రంతా మేల్కొని క‌ష్ట‌ప‌డుతుంది. మీనా కోసం టీ పెట్టి తీసుకొస్తాడు బాలు. టీలో షుగ‌ర్ వేయ‌డం మ‌ర్చిపోతాడు. బాలు త‌న కోసం ప్రేమ‌గా టీ పెట్ట‌డంతో బాగాలేద‌ని చెప్ప‌డం ఇష్టం లేక‌ షుగ‌ర్ లేక‌పోయినా తాగేస్తుంది మీనా.

పూల మాల‌ల లోడ్‌తో కూడిన ట్ర‌క్‌ను కొట్టేయాల‌ని గుణ మ‌నుషులు అనుకుంటారు. బాలు ఉన్న‌ప్పుడు కొట్టేస్తే రిస్క్ అని త‌న మ‌నుషుల‌ను హెచ్చ‌రిస్తాడు గుణ‌. ట్ర‌క్‌లో పూల మాల‌లు లోడ్ చేసి పంపిస్తారు బాలు, మీనా. ఆ ట్ర‌క్‌ను గుణ మ‌నుషులు ఫాలో అవుతారు. ట్ర‌క్ డ్రైవ‌ర్‌ను బురిడీ కొట్టించి వ్యాన్ కొట్టేస్తారు గుణ మ‌నుషులు.

చెప్పిన టైమ్‌కు పూల‌మాల‌లు రాక‌పోవ‌డంతో పొలిటిక‌ల్ లీడ‌ర్ వీర‌బాబు...బాలు స్నేహితుడు ...