భారతదేశం, జూన్ 25 -- న‌ల్ల‌పూస‌ల ఫంక్ష‌న్ స‌మ‌స్య‌ నుంచి గ‌టెక్క‌డానికి బాలును పావుగా వాడుకోవాల‌ని ఫిక్స‌వుతుంది రోహిణి. బాలును అడ్డుపెట్టుకొని త‌న తండ్రి టాపిక్‌ను ప్ర‌భావ‌తి ఎత్త‌కుండా చేయాల‌ని అనుకుంటుంది. అందుకోసం విద్య‌తో క‌లిసి కొత్త ప్లాన్ వేస్తుంది.

గుణ ద‌గ్గ‌ర ప‌నిమానేయ‌మ‌ని శివ‌తో అంటుంది పార్వ‌తి. తాను న్యాయంగానే సంపాదిస్తున్నాన‌ని త‌ల్లితో వాదిస్తాడు శివ‌. అప్పుడే అక్క‌డికి మీనా వ‌స్తుంది. అల్లుడుగారు రాలేదా అని మీనాను పార్వ‌తి అడుగుతుంది.

ఆ గారు వ‌ల్లే త‌న చేయి విరిగింది అంటూ బాలును త‌క్కువ చేసి మాట్లాడుతాడు శివ‌. మా ఆయ‌న విష‌యంలో మ‌రోసారి నోరుజారితే ఊరుకునేది లేద‌ని శివ‌కు వార్నింగ్ ఇస్తుంది మీనా.

రోహిణి, శృతి న‌ల్ల‌పూస‌ల ఫంక్ష‌న్‌కు బాలును రావొద్ద‌ని ప్ర‌భావ‌తి అంటున్నాద‌ని, బాలు వెళ్ల‌క‌పోతే ఆ వేడుక‌కు తాను వెళ్లేది లేద...