భారతదేశం, మే 13 -- మీనా త‌న‌ను ద్వేషించ‌డం బాలు త‌ట్టుకోలేక‌పోతాడు. రూమ్‌లో కాకుండా డాబాపై ప‌డుకుంటాడు. జీవితంలో మీ మొహం చూడ‌ను. మీతో క‌లిసి ఉండ‌లేన‌ని వెళ్లిపోతున్నాన‌ని మీనాతో త‌న‌తో చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన‌ట్లుగా బాలుకు క‌ల వ‌స్తుంది. మీనా అని అరుస్తూ మేల్కొంటాడు. ఇలాగే ఉంటే త‌న‌ను మీనా నిజంగానే విడిచిపోతుంద‌ని బాలు భ‌య‌ప‌డ‌తాడు. మీనాతో మాట్లాడ‌క‌పోతే గుండె బ‌రువుగా ఉన్న‌ట్లుగా ఫీల‌వుతాడు. మంచిత‌నాన్ని ప‌క్క‌న‌పెట్టి నిజం చెప్పేయాల‌ని అనుకుంటాడు. మీనా ద‌గ్గ‌ర‌కు వ‌స్తాడు.

కానీ ఎలా పిల‌వాలో తెలియ‌క ద‌గ్గు వ‌చ్చిన‌ట్లుగా సౌండ్ చేస్తాడు. ఆ అలికిడికి మీనా లేస్తుంది.

నిజం చెబితే మీనా త‌ట్టుకుంటుందా అని బాలు త‌న‌లో తానే ఆలోచిస్తాడు. ఆవేశ‌ప‌డి వ‌చ్చి ఇరుక్కుపోయాన‌ని అనుకుంటాడు. వాట‌ర్ తాగేసి వెళ్లిపోతాడు. ఒక్క సారీ చెబితే ఆయ‌న సొమ్మ...