భారతదేశం, మే 6 -- శివ‌ను పార్వ‌తి, సుమ‌తి హాస్పిట‌ల్ తీసుకొస్తారు. చేయి నొప్పి ఎక్కువ‌గా ఉండ‌టంతో భ‌రించ‌లేక‌పోతాడు శివ‌. దెబ్బ ఎలా త‌గిలింద‌ని డాక్ట‌ర్ అడిగితే బైక్‌పై నుంచి కింద‌ప‌డ్డాన‌ని అబ‌ద్దం చెబుతాడు. త‌న‌ను బాలు కొట్టిన సంగ‌తి దాచేస్తాడు. చాలా పెద్ద యాక్సిడెంట్ అయితే త‌ప్ప ఇంత‌లా దెబ్బ త‌గ‌ల‌ద‌ని, ఒంటిపై గాయాలు ఏం క‌నిపించ‌డంలేదు...అస‌లు నీకు యాక్సిడెంట్ ఎక్క‌డ అయ్యింద‌ని శివ‌ను డాక్ట‌ర్ ప్ర‌శ్న‌ల మీద ప్ర‌శ్న‌లు అడుగుతాడు. ఎదురుగా కారొచ్చింది...చూడ‌కుండా గుద్దేశాన‌ని శివ మ‌రో అబ‌ద్ధం చెబుతాడు.

శివ‌కు యాక్సిడెంట్ అయిన సంగ‌తి తెలిసి కంగారుగా మీనా హాస్పిట‌ల్‌కు వ‌స్తుంది. శివ బాధ‌తో విల‌విల‌లాడ‌టం చూసి ఎమోష‌న‌ల్ అవుతుంది. ఎలా జ‌రిగింది అని శివ‌ను అడుగుతుంది. బైక్ స్కిడ్ అయ్యి కింద‌ప‌డ్డాన‌ని మీనాతో చెబుతాడు శివ‌. చిన్న దెబ్బ కాబ‌ట్...