భారతదేశం, ఏప్రిల్ 29 -- గుడిలో మ‌ళ్లీ చేసుకుంటారు బాలు, మీనా. త‌ల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాల‌ని బాలు అనుకుంటాడు. బ‌ల‌వంతంగా బాలు, మీనాల‌ను దీవిస్తుంది ప్ర‌భావ‌తి. నీ పెళ్లాంతో మ‌ళ్లీ పెళ్లైనందుకు చాలా సంతోషంగా ఉంద‌ని వెట‌కారంగా అంటుంది. మీ ఇద్ద‌రికి ఇష్టం లేని పెళ్లి చేశాను. మీ కాపురం ఎలా ఉంటుందోన‌ని భ‌య‌ప‌డ్డాన‌ని, ఇప్పుడు ఆ భ‌యం పోయింద‌ని బాలుతో అంటాడు స‌త్యం. మ‌ళ్లీ మ‌ళ్లీ పెళ్లి చేసుకోకుండా పెళ్లి రోజులు మాత్రం చేసుకొండి అని ప్ర‌భావ‌తి.

పెళ్లి జ‌రిగేట‌ప్పుడు మీనా ముఖం కూడా చూడ‌లేద‌ని, నాలుగు రోజుల్లోనే న‌న్ను వ‌దిలిపెట్టి వెళ్లిపోతుంద‌ని అనుకున్నాని, ఈ రోజే మీనా ముఖం చూసి సంతోషంగా తాళిక‌ట్టాన‌ని బాలు అంటాడు. నేను కూడా ఈ మ‌నిషితో కాపురం చేయాలేన‌ని అనుకున్నాని, మా పెళ్లి నిల‌బ‌డ‌ద‌ని బాధ‌ప‌డ్డాన‌ని మీనా అంటుంది. ఇదే మాకు అస‌లైన పెళ్...