భారతదేశం, ఏప్రిల్ 25 -- సంజు కారు రిపేర్ కావ‌డంతో అత‌డితో పాటు మౌనిక‌ను త‌న కారులో వాళ్ల ఇంటి ద‌గ్గ‌ర దింపుతాడు బాలు. కిరాయి డ‌బ్బుల‌ను బాలుపై విసిరేసి వెళ్ల‌బోతాడు సంజు. అత‌డిని బాలు ఆపేస్తాడు. ఆ డ‌బ్బును తీసి క‌ళ్ల‌కు అద్దుకొని త‌న‌కు ఇవ్వ‌క‌పోతే నీ మ‌నుషుల ముందే నిన్ను కొడ‌తాన‌ని సంజుకు వార్నింగ్ ఇస్తాడు. బాలు వార్నింగ్‌కు భ‌య‌ప‌డి అత‌డు చెప్పిన‌ట్లే చేస్తాడు సంజు.

నాకోసం ఎందుకు సంజు ముందు నిన్ను నువ్వు త‌క్కువ చేసుకుంటావ‌ని బాలుతో మౌనిక అంటుంది. అన్న‌య్య‌ను క‌దా...నీ కోసం త‌ప్ప‌ద‌ని బాలు స‌మాధాన‌మిస్తాడు. సంజు లేక‌పోవ‌డంతో ఇప్ప‌టికైనా నిజం చెప్ప‌మ‌ని, ఈ గాయం సంజు వ‌ల్లే అయ్యింది క‌దా అని మౌనిక‌ను అడుగుతాడు బాలు. కానీ మ‌రోసారి అబ‌ద్ధం చెబుతుంది మౌనిక‌. సంజు త‌న‌ను బాగా చూసుకుంటున్నాడ‌ని అంటుంది.

నాతో పాటు అమ్మ‌నాన్న‌లు బాధ‌ప‌డుతున్నా...