Hyderabad, మే 5 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అందరం కలిసి దిగిన ఫొటోను సుశీల అడిగిందని బాలు చెబుతాడు. మనకు కూడా తీసుకురారా ఇంట్లో పెట్టుకుందాం అని సత్యం అంటాడు. ఇంట్లో ఫొటో ఫ్రేమ్‌లు పెట్టుకోడానికి ప్లేస్ లేదని ప్రభావతి అంటుంది. నీ సమస్య ఫొటో కాదు. అందులో మేముండటం కదా ఫొటోవతి అని బాలు అంటాడు.

లేకపోతే.. రోజు ఆ పూలకొట్టు మొహాన్ని చూడాలా అని ప్రభావతి అంటుంది. సత్యం షాక్ అవుతాడు. విసిగిపోయిన బాలు నాన్న నీ పద్ధతిలో చెబుతావా నా స్టైల్‌లో చెప్పమంటావా అని అంటాడు. కనీసం ఆ ఫొటో చూస్తే అయిన మనం సంతోషంగా ఉంటాం కదా అని సత్యం అంటాడు. అక్కడ మీ అమ్మ నాతో పనిచేయించింది. రోహిణి మావయ్య లేడు. గేమ్స్‌లో కూడా నేను అనుకుంది జరగలేదు అని ప్రభావతి అంటుంది.

అనుకుంది ఎప్పుడు జరగదు. ఉన్నంతలో సంతోషంగా ఉండాలి అని ప్రభావతికి చెప్పిన సత్యం ఫొటో ఫ్...