భారతదేశం, డిసెంబర్ 24 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 582వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సత్యం, ప్రభావతి తమ పిల్లలందరితో కలిసి బెస్ట్ కపుల్ పోటీలో పాల్గొనడానికి వెళ్తారు. అయితే అక్కడ బాలు, శృతి కలిసి ప్రభావతితోపాటు మనోజ్, రోహిణి పరువు తీస్తారు. తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (డిసెంబర్ 24) ఎపిసోడ్ బెస్ట్ కపుల్ పోటీలకు కామాక్షి కూడా తన భర్తతో కలిసి రెడీ అయ్యి రావడంతో మొదలవుతుంది. వాళ్లను చూసి ప్రభావతి, సత్యం షాక్ తింటారు. ఒకరికి తెలియకుండా మరొకరు రావడంతో ఒకరినొకరు దెప్పిపొడుచుకుంటారు.

ఈ పోటీల కోసం పాతిక వేలు ఖర్చు పెట్టానని కామాక్షి అంటుంది. రూ.లక్ష అనగానే ఆమె వచ్చేసిందని ప్రభావతి గురించి సత్యం అంటాడు. అందరూ కలిసి లోనికి వెళ్తారు. వాళ్లను చూసి ఎంట్రన్స్ దగ్గర ఉన్న రవి, శృతి ఆశ్చర్యపోతారు. మనో...