Hyderabad, సెప్టెంబర్ 18 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో మనోజ్ పడుకుని ఎంతకు లేవడు. ఇంతలో బాలు వచ్చి ఏమైంది.. మనోజ్ గాడు ఏం మింగి చచ్చాడు అని అంటాడు. వాడు అలసిపోయి పడుకున్నాడని ప్రభావతి అంటుంది. ఈ షాపు కూడా గోవిందా అని పాటలు పాడుతాడు బాలు.

అలసిపోతే ఆ మాత్రం నిద్రపోతారుగా అని రోహిణి అంటుంది. మరి రోజు కష్టపడే మీనా ఎంతలా పడుకోవాలి. మీనా నువ్వు పడుకుంటావా అని బాలు అంటాడు. నేను ఇంతలా మొద్దునిద్ర పడుకోను అని మీనా అంటుంది. వాడు ఇలా లేవడు అని మగ్గులో నీళ్లు తీసుకొచ్చి మనోజ్ మొహం మీద కొట్టి లేపుతాడు బాలు. దాంతో బాలును తిడతారు రోహిణి, ప్రభావతి.

వాన్ని ఇలా వేనుకొచ్చినంతకాలం వాడు బాగు పడడు అని రోహిణికి చెప్పి సత్యం వెళ్లిపోతాడు. తర్వాత మనోజ్ కోసం చికెన్ ఫ్రై, ఫిష్ కర్రీ, రోహిణి కోసం వెజ్ బిర్యాని చేయమని చెబుతుంది ప్రభావతి. ఇంటి...