భారతదేశం, జనవరి 9 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో క్రెడిట్ కార్డ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని తీసుకుంటాడు మనోజ్. ప్రతి నెల పదో తారీఖుకు వాడుకున్న డబ్బు కట్టాలని క్రెడిట్ కార్డ్ అతను చెబుతాడు. వారం రోజుల్లో కార్డ్ వస్తుందని చెప్పి వెళ్లిపోతాడు. కార్డ్ వచ్చాక గోవాకు ప్లాన్ చేద్దామని మనోజ్ అంటాడు.

తర్వాత రోహిణికి చింటు కాల్ చేసి నీతో ఉండాలంటాడు. నిన్ను ఇక్కడికే తీసుకొద్దామనుకుంటున్నా. స్కూల్ కూడా చూస్తున్నా అని రోహిణి చెబుతుంది. దాంతో రోహిణికి ముద్దు పెడతాడు చింటు. రోహిణికి డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరకడంతో వెళ్తుంది. మరోవైపు గుడికి పార్వతి, సుమతి వెళ్తారు.

అక్కడికి పక్కింటావిడ కాన్వకేషన్ డ్రెస్ తీసుకొచ్చి ఇస్తుంది. ఈ డ్రెస్సులో నీతో ఓ ఫొటో దిగాలని ఉందని చెబుతుంది. దాంతో సుమతి కాన్వకేషన్ డ్రెస్ వేసుకుంటుంది. అది చూసి పార...