Hyderabad, సెప్టెంబర్ 29 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో విద్య దగ్గరికి పూలు పట్టుకుని మీనా వెళ్తుంది. పూలు కట్టడం నేర్పిస్తుంది మీనా. నీకు కొంచెం తెలుసు కదా కట్టడం అని మీనా అంటే.. హా తెలుసు అమ్మాయినే కదా అని విద్య అంటుంది. అయితే అరగంటలో అయిపోతుంది అని మీనా అంటుంది.

అరగంటలో వెళ్తే మళ్లీ రోహిణి ఇబ్బంది పడుతుంది అని పూలు కట్టడం ఏం తెలియనట్లు నటిస్తుంది విద్య. తర్వాత మీనాను చూస్తే ఆశ్చర్యంగా ఉందని, అన్ని పనులు చేస్తవని, పైగా పూలు అమ్ముతావని, కార్పోరేషన్ వాళ్లు పూలకొట్టు తీయడమే బాధగా ఉందని విద్య అంటుంది.

మనకు ఏం జరిగిన మంచికే. బండి పోయి స్కూటీ వచ్చింది. ఇంటింటికి డెలివరి చేస్తున్నాను. ఏ కాలం అయిన ఎప్పటికీ మంచే గెలుస్తుంది. చెడ్డవాళ్లను కర్మ వదిలిపెట్టదు. ఏ కాలంలో అయినా అని మీనా అంటుంది. అందుకే రోహిణికి అన్ని సమస్యలు. దా...