Hyderabad, జూలై 9 -- స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు బుధవారం (జులై 9, 2025) 462వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ సత్యం కుటుంబ విభేదాలతో ఉత్కంఠగా జరిగింది. శృతి తాళి మార్చే వేడుకలో జరిగిన గొడవ తర్వాత ప్రభావతి.. బాలు, మీనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. సత్యం తన కొడుకును సమర్థిస్తాడు. అటు శృతి-రవి మధ్య సంఘర్షణ తీవ్రమవుతుంది. బాలు, మీనాలను ఇంట్లో వెళ్లిపోమనే సీన్ ఆసక్తిని రేకెత్తించినా.. బాలు వేసిన ప్లాన్ వర్కౌటవుతుంది.

శృతి తాళి వేడుకలో జరిగిన గొడవ తర్వాత ప్రభావతి ఇంటికి తిరిగి వచ్చి బాలుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. "బాలు వల్లే ఫంక్షన్ దెబ్బతింది. మీనా అతన్ని రెచ్చగొట్టింది" అని నిందిస్తుంది. సత్యంతో.. "నేను ముందే చెప్పాను.. ఈ తాగుబోతును ఫంక్షన్‌కు తీసుకెళ్లొద్దని, కానీ నువ్వు అతన్ని సమర్థించావు" అని మండిపడుతుంది.

సత్య...