Hyderabad, జూలై 3 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో శ్రుతికి ముందు నల్లపూసల కార్యక్రమం చేస్తారు. శ్రుతి మీద ఉన్న నగలు చూసి ప్రభావతి మురిసిపోతుంది. అందరి ఆశీర్వాదాలు తీసుకుంటారు రవి, శ్రుతి. బాలును మందు తాగమని తాగుబోతు విసిగిస్తాడు. రోహిణిని తన తండ్రి గురించి మనోజ్ అడుగుతాడు. శ్రుతి ఒంటి మీద నగలు కంటే మీ నాన్న ఎక్కువ తెస్తాడని అమ్మ అంటుందని మనోజ్ అంటాడు.

దాంతో రోహిణి చిరాకు పడుతూ వెళ్లిపోతుంది. ఇప్పుడు అందరం కలిసిపోయాం అని, ఒకరి ఇంటికి మరొకరం వెళ్లొచ్చు అని రవి, శ్రుతి సంతోషిస్తారు. బాలు తాగేసి గొడవ చేస్తే తప్పా మా అత్తయ్య నన్ను వదలదు. ఆ తాగుబోతోడు ఎక్కడో చూడు అని విద్యతో రోహిణి అంటుంది. తర్వాత రోహిణికి నల్లపూసలు వేస్తాడు మనోజ్. రోహిణి కోపంగా ఉంటుంది.

మంచి సెటప్ ఉంది. కారు డిక్కీలో పెట్టాను అని తాగుబోతు అంటే ఊపిరి ఆడక చ...