భారతదేశం, నవంబర్ 25 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 561వ ఎపిసోడ్‌లో గుడిలో అందరూ సంతోషంగా ఉన్న సమయంలో సంజూ రావడం, మౌనికను నానా మాటలు అనడం, అది చేసి బాలు అతన్ని చితకబాదే సీన్లతో సాగిపోయింది. అయితే మనోజ్ మాత్రం మరోసారి బతికిపోతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 25) ఎపిసోడ్ అందరూ గుడికి వెళ్లే సీన్ తో మొదలవుతుంది. అయితే మనోజ్ బాగోతం బయటపెట్టడానికి గుడిలో తనకు తెలిసిన మనిషితో బాలు ప్లాన్ చేస్తాడు. మనోజ్ గురించి చెప్పి.. తాను చెప్పినట్లు చేస్తే రూ.1000 ఇస్తానంటాడు. ఆ వ్యక్తి సరే అంటాడు. దీంతో నగల గురించి నిజం బయటపడుతుందని బాలు అనుకుంటాడు.

బాలు చెప్పినట్లే ఆ వ్యక్తి పూనకం వచ్చినట్లుగా వేషమేస్తాడు. మనోజ్ ను చూడగానే అతన్ని చితకబాదుతాడు. నువ్వు నీ ఇంట్లో వాళ్లను, తోడబుట్టిన వాళ్లకు చేసిన మోసం నాకు తెలుసు.. నీకు ఇక్కడికి రా...