Hyderabad, సెప్టెంబర్ 10 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 507వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు, మీనా తొలి పెళ్లిరోజు వేడుకలు ఘనంగా జరుపుతారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ జరిగాయి. వాళ్ల సెలబ్రేషన్స్ చూసి ప్రభావతి, మనోజ్, రోహిణి, సంజూలాంటి వాళ్లు కుళ్లుకుంటారు. శృతి తల్లి మరింత అవమానిస్తుంది.

గుండె నిండా గుడి గంటలు బుధవారం (సెప్టెంబర్ 10) ఎపిసోడ్ బాలు, మీనా పెళ్లి రోజు సెలబ్రేషన్స్ తో మొదలవుతాయి. ప్రభావతి వేధింపులను ఏడాది భరించిన మీనా గ్రేటే అంటూ కామాక్షి, శృతి, రోహిణి అంటారు. ఆ తర్వాత బాలు, మీనా కిందికి రాగానే శృతి వాళ్లకు గ్రాండ్ వెల్కమ్ చెబుతుంది. ప్రభావతి మాత్రం ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం చూసి లోలోపల కుళ్లుకుంటుంది. కనీసం ఈ ఒక్క రోజైనా కొడుకు, కోడలును మనస్ఫూర్తిగా దీవించమని భార్యకు సత్యం క్లాస్ పీకుత...