Hyderabad, జూలై 14 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అందరి మనసులు విరగొట్టేది నువ్వు అని ప్రభావతిని బాలు అంటే.. నిజాలేగా మాట్లాడుతున్నాడు అని సత్యం సపోర్ట్ చేస్తాడు. ఇల్లు ఇలా వెలవెలబోడానికి కారణం నువ్వే అంటున్నాడు. దీనంతటికి కారణం నీ మనసాక్షిని అడుగు అని సత్యం అనడంతో అంతా వెళ్లిపోతారు. అందరు నన్నే అంటున్నారు అని ప్రభావతి అంటే.. లేదు అందరిని నువ్వే అంటావ్ అని సత్యం వెళ్లిపోతాడు.

మరోవైపు అంతా రవి గురించి ఆలోచిస్తున్నారు అని బాలు, మీనా ఆలోచిస్తారు. సురేంద్రతో గొడవ గురించి మాట్లాడుకుంటారు. వాళ్ల ఇంటికి సురేంద్రకు రెండు తగిలించి వారిద్దరిని ఇంటికి తీసుకొస్తాను అని బాలు అంటాడు. ప్రతిదానికి కొట్టడమే పరిష్కారం కాదు. నచ్చజెప్పి తీసుకురావాలని మీనా అంటుంది. మరుసటి రోజు ఉదయం శ్రుతి డబ్బింగ్ స్టూడియోకు వెళ్తుంది.

ఇంకా వర్క్ చేయడం ...