భారతదేశం, నవంబర్ 20 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణికి కాల్ చేసి చింటు మాట్లాడుతాడు. తల్లిని రోహిణి తిడుతుంది. వాన్ని ఆపలేకపోతున్నాను. ప్రతిరోజు నువ్వు ఎప్పుడు వస్తావని అడుగుతున్నాడు. వాడి బర్త్ డే వస్తుంది. అప్పుడైనా వస్తావా అని రోహిణి తల్లి అంటుంది.

సరే చూస్తాను అని రోహిణి చెబుతుంది. ఇంతలో మనోజ్‌కు శ్రుతి కాల్ చేసి గత వారం మా గోల్డ్ షాప్‌లో కవరింగ్ నగలు కొన్నారుగా. అందుకే మీకు ఫ్రీగా బెన్‌ఫిట్స్ ఇస్తున్నాం. మీరు కొన్నట్లు ఆర్డర్ కాపీ ఉంది అని అన్ని నగలు పేర్ల చెబుతుంది శ్రుతి. మీలాంటి కస్టమర్స్‌కు గోల్డెన్ ఆఫర్. మీరు కొన్న నగల మీద 30 పర్సంట్ క్యాష్ బ్యాక్ ఇస్తాం. లేదా ఏదైనా నెక్లెస్ కొనొచ్చు అని ఆఫర్స్ చెబుతుంది శ్రుతి.

ఈ ఆఫర్ ఇవాల్టీకే ఉందని శ్రుతి చెబుతుంది. ఆఫర్ చూస్తే ఆశగా ఉంది. కానీ, ఎక్కువ ఆశకు పోతే నా...