భారతదేశం, అక్టోబర్ 27 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు తాగి ఇంటికి వస్తాడు. సంస్కారానికి ఓ గీత ఉంటుంది. అది దాటితే రౌడీతనం. ఒక ఆడదానితో అమర్యాదగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు అని బాలుకు చెబుతాడు సత్యం. ఇంతలో అంతా వస్తారు. బాలు మళ్లీ తాగొచ్చాడని ప్రభావతి గొడవ చేస్తుంది.

మనోజ్, శ్రుతి బాలును అంటారు. అత్తింటి విషయాలు పుట్టింట్లో చెప్పడం అవసరమా డబ్బుడమ్మా అని బాలు అంటాడు. నీ భార్య మాత్రం రేడియోలో వార్తలు చదివినట్లు తన పుట్టింట్లో చెప్పదా అని ప్రభావతి అంటుంది. అది ఆవిడ అలుసుగా తీసుకుని మా నాన్నను అవమానించలేదు అని బాలు అంటాడు. ఆవిడ ఏదో పెద్ద మనసు చేసుకుని ఇద్దామనుకుంది. నువ్వు దాన్ని గొడవ చేశావ్ అని ప్రభావతి అంటుంది.

ఏంటీ ఆవిడ పెద్ద మనసుతో ఇద్దామనుకుందా. మీ కొడుకును తీసుకోలేదని తిడుతున్నారా. అంటే ఎవరో దానం ఇస్తే తీసుకోవా...