భారతదేశం, నవంబర్ 18 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 556వ ఎపిసోడ్ లో ప్రభావతి, మనోజ్ కు తన విశ్వరూపం చూపిస్తాడు బాలు. సుశీల వెళ్లిపోగానే గిల్టు నగల గురించి నిలదీస్తాడు. కానీ ప్రభావతి బుకాయిస్తూ నిందను తిరిగి మీనాపైనే మోపుతుంది. కానీ శృతి, బాలు ప్లాన్ దెబ్బకు మనోజ్ అడ్డంగా దొరికిపోతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (నవంబర్ 18) ఎపిసోడ్ బాలు, మీనాలకు సుశీల ఇచ్చే గిఫ్ట్ తో మొదలవుతుంది. ఇది వంశ గౌరవం అంటూ ఓ బంగారు నగను సుశీల వాళ్లకు ఇస్తుంది. తనకు మరుపురాని చిన్ననాటి జ్ఞాపకాలను అందించిన బాలుకే అది చెందాలని ఆమె స్పష్టం చేస్తుంది. అంతేకాదు ప్రతి ఏటా దీనిని పూజించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకూడదని తేల్చి చెబుతుంది. దీంతో మిగిలిన వాళ్లు నిరాశ చెందుతారు. ఆ తర్వాత మౌనిక తాను ఇక వెళ్తానని చెప్పి తన అత్తారింటికి వెళ్లిపోతుంది.

ఆరు...