Hyderabad, జూలై 25 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో పెళ్లయిన తొలిసారి అందరితో కలిసి చాలా సంతోషంగా గడిపాను. వెళ్లొస్తాను అని వెళ్తారు మౌనిక, సంజు. ఎందుకు వచ్చారు ఎందుకు వెళ్లారు. డబ్బుడమ్మ వాళ్ల ఇంట్లో ఉన్నది ఎవరు చెప్పారు. ఇన్ని తెలుసుకున్న వీడు గుడి మెట్ల మీద అడుక్కుంది కూడా తెలుసా అని బాలు అంటాడు.

ఎవరు అడుక్కున్నారని శ్రుతి అడిగుతుంది. బాలు చెప్పబోతుంటే నోట్లో కేక్ పెట్టి ఆపుతుంది మీనా. టెర్రస్‌పై ఉన్న రవి దగ్గరికి వెళ్లిన మనోజ్ అత్త మామలతో మంచిగా ఉండాలని, రేపు రెస్టారెంట్ పెట్టుకోడానికి మీ మావయ్యేగా డబ్బులిచ్చేదని అంటాడు. నా సంగతి సరే మీ మామ సంగతి ఏమైంది అని రవి అడుగుతాడు. ఆయన పార్ట్‌నర్స్ మోసం చేశారట, ఏదో సమస్య అట అని మనోజ్ అంటాడు.

ఎప్పుడు ఇంకొకరి సాయం గురించి ఎదురుచూడొద్దు అని ఎగ్జాంపుల్‌గా బాలు గురించి చెబుతాడు ...