Hyderabad, అక్టోబర్ 9 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 528వ ఎపిసోడ్ బాలు, మీనాతోపాటు రోహిణి, గుణ, ప్రభావతి చుట్టూ తిరిగింది. తన బ్లాక్‌మెయిలర్ ను భయపెట్టాలంటూ గుణ దగ్గరకు రోహిణి వెళ్లడం, ఆ తర్వాత బాలు కూడా దినేష్ ను చితగ్గొట్టి పోలీసులకు అప్పగించడం ఈ ఎపిసోడ్ హైలైట్ గా చెప్పొచ్చు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (అక్టోబర్ 9) ఎపిసోడ్ కిచెన్ లో శృతి, మీనా మాట్లాడుకునే సీన్ తో మొదలవుతుంది. ఆంటీ నిన్ను అన్ని తిట్టినా నువ్వు భరిస్తావు.. నేనైతే అస్సలు భరించను.. తిట్టుకు తిట్టు.. దెబ్బకు దెబ్బ ఇస్తానని శృతి అంటుంది. అవసరమైతే అట్ల కాడ కాల్చి వాత పెడతానని కూడా చెబుతుంది.

దీంతో మీనా కూడా నవ్వుతుంది. ఇదంతా బయటి నుంచి విన్న ప్రభావతి కిచెన్ లోకి రాగానే శృతి వెళ్లిపోతుంది. దీంతో వాళ్లను నువ్వు రెచ్చగొట్టి నాపైకి ఉసిగొల్పుతున్నావా అంటూ మరోస...