భారతదేశం, జనవరి 5 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో చింటు బర్త్ డేలో కల్యాణ్ గురించి చుట్టు పక్కలవాళ్లు అడుగుతారు. చింటు అమ్మ అంటే మీనా అడిగితే.. అత్తను అమ్మ అంటున్నాడు అని రోహిణి తల్లి సుగుణ చెబుతుంది. అత్త కాదు అమ్మ అని చింటు అంటాడు. తర్వాత అమ్మ కాదు అత్త అని చింటు అంటాడు.

అమ్మ మీతో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్తాడు బాలు. ఆ మాటలు రోహిణి వింటుంది. వీడి పుట్టినరోజున కూడా అయిన చింటు అత్త రావొచ్చుగా. వాడు అత్తనే అమ్మ అనుకుంటున్నాడు. ఇంకెప్పుడు ఆవిడ వస్తుంది. ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి నేను మాట్లాడతాను అని బాలు అంటాడు.

తను రాదు బాలు. తనకు రావడం ఇష్టంలేదు. తన అన్న కొడుకు కాదు. కన్నకొడుకు. నేను అత్త అని చెప్పలేదు. వాళ్ల అమ్మే అలా చెప్పమంది. నిజం ఎవరికి చెప్పలేదు. అబద్ధం చెప్పలేక నరకం అనుభవిస్తున్నాను. కారణం నేనే. నేను తన జీవ...