Hyderabad, సెప్టెంబర్ 26 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణి తల్లి సుగుణను, కొడుకు చింటును ఇంటికి తీసుకొస్తారు బాలు, మీనా. అది చూసి ప్రభావతి అరుస్తుంది. ఇదేమైనా సత్రమా. వీళ్లకే దిక్కులేదు. ఇంకో ఇద్దరిని తీసుకొచ్చారా అని తిడుతుంది. ఇలా కల్చర్‌లెస్‌గా బిహేవ్ చేస్తారేంటీ అని శ్రుతి గొణుగుతుంటే రవి ష్ సైలెంట్‌గా ఉండమంటాడు.

మీ పుట్టిల్లు ఉందిగా అక్కడికి తీసుకెళ్లొచ్చుగా అని మీనాను అంటుంది ప్రభావతి. తీసుకెళ్తే ఇలా మొహం మీదే మా అమ్మ అనదు అని చురకలు వేస్తుంది మీనా. అమ్మా ఉండనివ్వు. వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు నన్ను బాగా చూసుకున్నారు. రోహిణి కనిపిస్తుందని బాగా ధైర్యం చెప్పారు అని మనోజ్ మంచోడిలా మాట్లాడుతాడు. అది చూసి అంతా షాక్ అవుతారు.

కావాలంటే వాళ్లు మా రూమ్‌లో పడుకుంటారు అని రోహిణి అంటుంది. దాంతో మరింత అవాక్కవుతారు అంతా....