Hyderabad, ఆగస్టు 6 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ 482వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో రోహిణి కష్టాలు రెట్టింపవడం చూడొచ్చు. అటు బాలు కూడా ఆమెతో ఆడుకుంటాడు. ఇక హాల్లోనే బాలు, మీనా రొమాన్స్ ఎపిసోడ్ లో మరో హైలైట్ అని చెప్పొచ్చు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ బుధవారం (ఆగస్టు 6) ఎపిసోడ్ గుడి నుంచి బాలు వెళ్లిపోయే సీన్ తో మొదలవుతుంది. కారులో కల్పన వెయిట్ చేస్తుండటంతో బాలు వెళ్లిపోతాడు. అటు గుడిలో రోహిణి ఎలాగోలా పొర్లుదండాలు పూర్తి చేస్తుంది. పూజలు ఇంకా అయిపోలేదని ఒక్కటి మిగిలి ఉందని అనడంతో రోహిణి షాక్ తింటుంది. ఇక చాల్లే వదిలెయ్ అని అందరూ అనడంతో వాళ్లపై ప్రభావతి మండిపడుతుంది.

రోహిణిని అర్చన చేయించడానికి తీసుకెళ్తుంది. అక్కడ రోహిణి వాళ్ల తండ్రి పేరు అడుగుతాడు పూజారి. దీంతో అసలు లేని నాన్న పేరు చెప్పాలా, పోయిన నాన్న పేరు చెప్పాలా...