Hyderabad, సెప్టెంబర్ 25 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో హాస్పిటల్‌లో బాబుకు చాలా పెద్ద గాయమే అయిందిగా. ఆ పెద్దావిడను ఓదార్చి వస్తున్నా అని రోహిణి అంటుంది. ఆ బాబుకు అమ్మ నాన్న ఎవరు లేరు అని మీనా అంటే ఎవరో అత్త ఉందట. ఆవిడ దుబాయ్‌లో ఉంటదట. పెద్దవాళ్లను, పసివాళ్లను వదిలేసి అలా ఉంటారా. ఏం మనిషో అని ఇన్‌డైరెక్ట్‌గా రోహిణిని అంటాడు బాలు.

ఆమె నెంబర్ తీసుకుని చెడామడ తిట్టాలని ఉంది అని బాలు అంటాడు. నీకెందుకు అని రోహిణి అరుస్తుంది. అదే.. ఆవిడ ఏ బాధలో ఉందో. మనకెందుకు. అయినా ఆవిడ డబ్బు పంపిస్తేనేగా వీళ్లు ఇక్కడ బతికేది అని రోహిణి అంటుంది. ఇన్ని విషయాలు నీకెలా తెలుసు అని బాలు అంటే.. ఇందాక పెద్దావిడ చెప్పిందని రోహిణి అంటుంది.

ఇంకెందుకు మీరు వెళ్లలేరు. మీ పనులు పోతాయిగా అని రోహిణి అంటుంది. కూలీ పనులు చేసుకునేవాళ్లం. మా పనులు పోతే ...