Hyderabad, ఆగస్టు 28 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో రోహిణికి మీనా, శ్రుతి కౌంటర్స్ వేస్తారు. మీరు బాలులా మాట్లాడుతున్నారా అని రోహిణి అంటుంది. పైన అన్నదమ్ములు తాగడం గురించి మాట్లాడుకుంటారు. బాలునే ఎక్కువగా అందరికంటే తాగుతాడు అని రోహిణి అంటుంది. ఈపాటికి తూలుతూ ఉంటాడు అని రోహిణి అంటుంది.

మరోవైపు పైన ఒక్క బీర్‌కే మనోజ్ తెగ వాగుతుంటాడు. పైనుంచి సౌండ్స్ వస్తున్నాయని శ్రుతి అంటే.. ఇంకెవరు అని బాలునే, బాలు వల్లే శబ్ధాలు అవుతుంటాయి అని రోహిణి అంటుంది. ఆయన ఇవాళ తాగను అని నాకు మాటిచ్చారు అని మీనా అంటుంది. లేదు పందెమా అని రోహిణి అంటే.. పందెం ఎందుకు వెళ్లి చూసొద్దాం పదండి అని శ్రుతి తీసుకెళ్తుంది.

తీరా పైన చూస్తే మనోజ్ వాగుతూ నేలపై పాకుతుంటాడు. రోహిణి కాళ్లు పట్టుకుని పార్క్‌లో చెట్టు చుడీదార్ వేసుకుంటుందా అని మనోజ్ అంటే మీనా, శ...