Hyderabad, సెప్టెంబర్ 30 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 521వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో వాళ్ల ముందు రోహిణి దొరికిపోయే పరిస్థితి వస్తుంది. తాను వేసిన ప్లాన్స్ అన్నీ తలకిందులవడంతో రోహిణి పూర్తిగా ఇరుక్కుపోతుంది. బాలుతోపాటు రవిలోనూ రోహిణిపై అనుమానం మొదలవుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (సెప్టెంబర్ 30) ఎపిసోడ్ చింటూని రోహిణి దగ్గరకు తీసుకొని నీ అమ్మను నేనే అని చెప్పే సీన్ తో మొదలవుతుంది. అత్తను కాదు అమ్మను.. కానీ ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను.. ఈ ఇంట్లో ఉన్నప్పుడు తనను అమ్మ అని పిలవొద్దు అని చింటూకి చెబుతుంది. ఆ పసి మనసుకు నీ పరిస్థితి ఎలా అర్థమవుతుందమ్మా అని రోహిణితో సుగుణ అంటుంది.

తప్పదమ్మా.. ఈ ఇంట్లో నేను కోటీశ్వరుడి కూతురు అని అనుకున్నన్ని రోజులే విలువ ఉంటుంది.. మీనా పరిస్థితి ఎలా ఉందో చ...