భారతదేశం, జనవరి 20 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 601వ ఎపిసోడ్ లో రోహిణి రెండో ప్రెగ్నెన్సీ గుట్టు విప్పేస్తుంది మీనా. బాలుతోపాటు శృతి, రవి, ప్రభావతి, సత్యంలకు నిజం తెలిసిపోతుంది. దీంతో రోహిణి జీవితంలో పెద్ద ట్విస్టే ఎదురయ్యేలా కనిపిస్తోంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (జనవరి 20) ఎపిసోడ్ లో బాలు కోసం మీనా వండిన చికెన్ ను ఇంట్లో వాళ్లు లొట్టలేసుకుంటూ తింటారు. ముఖ్యంగా మనోజ్, ప్రభావతి ఫుల్లుగా తినేస్తారు. దీంతో గిన్నె ఖాళీ అయిపోతుంది. బాలేదనుకుంటూనే ప్రభావతి పీకలదాకా తింటుంది. పైగా మీనాను అందరూ పొగుడుతుంటే.. ఆమెకు జీర్ణం కాదు.

ఇటు మీనా కోసం బాలు హల్వా తీసుకొని ఇంటికి వస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకోగానే మాట్లాడుకోవాలా వద్దా అంటూ సందేహంలో పడతారు. చివరికి మీనాయే బాలు దగ్గరికి వెళ్తుంది. నీకోసం ...