భారతదేశం, నవంబర్ 24 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో నాలుగు లక్షల మోసం గురించి మనోజ్‌ను తిడుతుంది రోహిణి. ఇన్ని రోజులు మోసం చేశావా. నాకు ఎందుకు చెప్పలేదు అని అంటుంది రోహిణి. నువ్వు తిడతావని చెప్పలేదు. నా మీద నీకు గౌరవం పోతుందని చెప్పలేదు అని మనోజ్ అంటాడు.

నాకు ముందే చెప్పి ఉంటే వేరేలా డీల్ చేసేదాన్ని. బాలు చూడు ఎలా అంటున్నాడో. ఎప్పుడు వెనుకేసుకొచ్చే మీ అమ్మ నిన్ను కొట్టింది అని రోహిణి అంటుంది. ఈ విషయం అమ్మకు ముందే తెలుసు అని మనోజ్ చెబుతాడు. దాంతో రోహిణి షాక్ అవుతుంది. ఆరోజే అమ్మకు చెప్పాను. అందరి ముందు బయటపడేయడానికే నన్ను కొట్టింది అని మనోజ్ అంటాడు.

నాలుగు లక్షలు మోసపోయావ్, దాన్ని లాభంగా చూపించేందుకు మణికంఠ దగ్గర అప్పు చేశావ్. ఇది చెప్పడానికి ఏముందని రోహిణి అంటుంది. లేదు నేను మణికంఠ దగ్గర అప్పు తీసుకోలేదు. మీనా నగలను...