భారతదేశం, డిసెంబర్ 30 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు, మీనాకు లక్ష రావడం చూసి ప్రభావతి వాళ్లు ఏడుస్తుంటారు. సత్యం వచ్చి బాలు, మీనాకు సపోర్ట్ చేస్తారు. వాళ్లు ఫ్రాడ్ చేసి గెలిచారని మనోజ్ అంటాడు. దాంతో మనోజ్ చేసిన మోసాల గురించి మీనా అంటుంది. లక్ష ఇస్తేనే లక్షణమైన జంట అయిపోదని ప్రభావతి అంటుంది.

వాళ్లకే సరిగా తెలియనట్లుంది. అండర్‌స్టాండింగ్ అంటే మాది. మేము ఎప్పుడైన గొడవ పడ్డామా అని మనోజ్ అంటాడు. నువ్వు ఏం చేసిన పార్లరమ్మా భరిస్తుంది. ఇంకెలా గొడవ అవుతుందిరా. అయినా మీరిద్దరు కేడీగాళ్లను మార్కులు వేసేవాళ్లే చెప్పారు. చిన్న చిన్న తగాదాలు రావట్లేదంటే భార్యాభర్తలు ఏదో దాస్తున్నారట. అది బయటపడితే ఎప్పటికీ క్షమించుకోలేరట. వాళ్లు చెప్పింది నిజమే అనిపిస్తుంది నాన్న అని బాలు అంటాడు.

దాంతో రోహిణి వంటింట్లోకి వెళ్లి నీళ్లు తాగుత...