Hyderabad, జూలై 15 -- స్టార్ మా సీరియల్ గుండె నిండా గుడి గంటలు జులై 15 ఎపిసోడ్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు జరిగాయి. ఈ 767వ ఎపిసోడ్ లో రవి కోసం ప్రభావతి నిరాహార దీక్ష, ఆమెను చూసి అందరూ పస్తులు ఉండటం, అటు శృతికి రవి బిర్యానీ పట్టుకెళ్లడం, ఇటు తల్లి కోసం బాలు ఇచ్చే సర్‌ప్రైజ్ లతో ఎపిసోడ్ సరదాగా సాగిపోతుంది. ఇక రోహిణి తండ్రి అదృశ్యం గురించి కొత్త డ్రామా మొదలవుతుంది.

ఎపిసోడ్ మనోజ్.. రోహిణితో కలిసి హాలులోకి వచ్చే సన్నివేశంతో ఆరంభమవుతుంది. మనోజ్ కిందికి వస్తూ.. "మీనా ఇంకా వంట చేయలేదా?" అని రోహిణిని అడుగుతాడు. "నాన్నా, బాగా ఆకలేస్తోంది" అని సోఫాలో కూర్చున్న సత్యంతో మనోజ్ అంటాడు. సత్యం ఆగ్రహంగా.. "ఎప్పుడూ తిండి గురించే ఆలోచిస్తావా? ఈ వయసులో జాబ్ చేయకుండా ఇంట్లో కూర్చుంటావా?" అని నిలదీస్తాడు.

మనోజ్ స్పందిస్తూ.. "కెనడాలో జాబ్ కోసం వెయిట్ చేస్త...