Hyderabad, ఆగస్టు 13 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 487వ ఎపిసోడ్ లో రోహిణి, మనోజ్ లను బాలు గట్టిగానే ఇరికిస్తాడు. అటు సంజూ బర్త్ డే సందర్భంగా ఫ్రెండ్స్ ముందే భార్య మౌనికను దారుణంగా అవమానిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ రోహిణి తన తండ్రి రూ.25 లక్షలు పంపించాడని చెప్పడంతో ప్రభావతి సంబరపడే సీన్ తోనే మొదలవుతంది. అయితే ఇప్పటికే మనోజ్ రూ.40 లక్షలు తీసుకొని నాన్నను మోసం చేశాడు కాబట్టి.. వచ్చిన ఈ రూ.25 లక్షల్లో తమకూ వాటా ఇవ్వాలని బాలు అంటాడు. కానీ ఆమె తండ్రి పంపిన డబ్బులో మనకెందుకు వాటా అని అటు రవి, ఇటు మీనా అంటారు. చివరికి సత్యం కూడా అదే చెప్పడంతో బాలు సరే అంటాడు.

ఈ రూ.25 లక్షలతో బిజినెస్ చేసి లాభాలు రాగానే ఎవరి వాటా వారికి ఇచ్చేస్తాం అని రోహిణి అంటుంది. మరో రూ.15 లక్షలు కూ...