భారతదేశం, డిసెంబర్ 2 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 566వ ఎపిసోడ్ లో మొత్తానికి మీనా నగలను తానే అమ్మేశానని మనోజ్ ఒప్పుకుంటాడు. దీనికి తల్లే సాయం చేసిందని చెప్పడంతో అందరూ కలిసి ఇద్దరినీ తిడతారు. దీంతో ప్రభావతి రెచ్చిపోతుంది. మీనా ముఖంపై బంగారం విసిరికొట్టడంతో ఇంట్లో పెద్ద రచ్చ మొదలవుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ మంగళవారం (డిసెంబర్ 2) ఎపిసోడ్ ఇంట్లో రెండో నిమ్మకాయ ఎలా వచ్చిందని బాలు ఆరా తీయడంతో మొదలవుతుంది. తాను తెచ్చిన నిమ్మకాయ పిల్లను కనిందా అంటాడు. దీంతో ప్రభావతి తానే ఆ నిమ్మకాయ తెచ్చానని అంటుంది. ఇంతకుముందు గుడికి వెళ్తే అక్కడ పంతులు ఇచ్చారని చెబుతుంది. అయినా బాలు మాత్రం ప్రభావతి, మనోజ్ తో ఆడుకుంటాడు.

ఇటు మీనాతో బాలు ఇదే విషయం చెబుతాడు. ఆ నిమ్మకాయను ఎవరో స్వామీజీ దగ్గరికి వెళ్లి తీసుకొచ్చారని అంటాడు. ఇక నుంచి తాను...