Hyderabad, జూన్ 20 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో అల్లుడు రవిని ఇంటికి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్లు, నల్లపూసలు కార్యక్రమం గ్రాండ్‌గా చేసి ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశాను అని శ్రుతి తల్లి శోభన చెబుతుంది. ఎంత చేసిన రెండు రోజులు మాత్రమే ఉంచగలం. తర్వాత ఎలా ఉంటారు అని సురేంద్ర అంటాడు.

నేను అన్నీ ప్లాన్ చేసే ఇవన్నీ చేస్తున్నాను. ఒక్కసారి ఇక్కడికి వస్తే వెళ్లకుండా చేస్తాను. పెద్ద గొడవ చేయడానికే ఫంక్షన్ చేస్తున్నాను. బాలును రెచ్చగొడితే చాలు వాడే గొడవ చేస్తాడు. ఏం చేస్తానో మీరే చూస్తారుగా అని శోభన అంటుంది. మరోవైపు రాత్రిపూట సడెన్‌గా లేచి మీనా పనులు పట్టించుకోవట్లేదు. టిఫిన్‌కు పిండి కలిపిపెట్టిందో లేదో అంటుంది ప్రభావతి.

ఇంకొకరు ఉంటే మూటముళ్లే పెట్టి పంపించేవాన్ని. కట్టుకున్న భార్యవి కాబట్టి చచ్చినట్లు భరిస్తున్నాను అని స...