Hyderabad, జూలై 28 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో బాలు వచ్చి మీనాతో రొమాంటిక్‌గా మాట్లాడుతాడు. శ్రుతిలాగే చేతికి మల్లెపూలు కట్టుకుని వాసన చూస్తాడు. అది చూసి మీనా తెగ నవ్వుతుంది. బాలు పైకి లేస్తుంటే మీనా ఆపుతుంది. దాంతో బాలు ప్లేట్‌కు తగలడంతో మల్లెపూలు అన్ని వర్షంలా పడిపోతాయి. ఒకరిపై ఒకరు పడుకుని రొమాంటిక్‌గా చూసుకుంటారు.

మరుసటి రోజు ఉదయం రెండు మూడు ఆర్డర్లు ఇవ్వాలని మీనా బయటకు వెళ్తుంది. తర్వాత ఇంటికి శోభన వస్తుంది. రోహిణిని పిలిచి టీ పెట్టమంటుంది ప్రభావతి. శ్రుతి వెంటనే ఇంటికి వచ్చిందని ప్రభావతి అంటే.. వెళ్లనంటే వెళ్లను అని చెబితే పెళ్లయిన అమ్మాయి పుట్టింట్లో ఉండాలని నచ్చజెప్పి పంపించాను అని అబద్ధం చెబుతుంది శోభన.

ఇద్దరు బాలు గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో పూలమ్మాయి అని ఒకావిడ వచ్చి వందకు పూలు ఇవ్వమనంటుంది. మీనా లే...