భారతదేశం, అక్టోబర్ 30 -- గుండె నిండా గుడి గంటలు ఈరోజు అంటే 543వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తనను కాపాడమని తల్లి కాళ్లపై మనోజ్ పడటం, అతన్ని కాపాడేందుకు మీనా నగలను ఇవ్వడానికి సిద్ధమైన ప్రభావతి వాటిని దొంగతనం చేయడం, ఆ తర్వాత కవర్ తారుమారు కావడంతో ఆమె బాలుకి దొరికిపోవడంలాంటి సీన్లతో సాగిపోయింది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (అక్టోబర్ 30) ఎపిసోడ్ బాలు, మీనా తాము పొదుపు చేసిన డబ్బులు దాచే సీన్ తో మొదలవుతుంది. ఆ తర్వాత కాళ్లు నొప్పులుగా ఉన్నాయన్న బాలుకి వేడి నీళ్లు తెచ్చి మీనా సేవలు చేస్తుంది. అది చూసిన ప్రభావతి.. వీడైనా వంశం పరువు నిలబెట్టాడంటూ రవి దగ్గరికి వెళ్తుంది.

బాలుగాడు మీనాతో ఎలా సేవలు చేయించుకుంటున్నాడో చూడు.. నువ్వూ ఉన్నావు నీ భార్య కాళ్లు పట్టుకుంటావంటూ అతన్ని తీసుకొస్తుంది. కానీ అప్పటికి సీన్ రివర్సై మీనా చేతులకు బాలు ...