భారతదేశం, ఫిబ్రవరి 16 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్‌‌ ఈరోజు ఎపిసోడ్‌లో శివ ఇంటికి తాగొచ్చిన విషయం మీనాకు చెబుతుంది పార్వతి. గుణ గాడు పార్టీ ఇచ్చాడని, అడిగితే మా మీద అరుస్తున్నాడని పార్వతి చెబుతుంది. నువ్వయిన కాస్తా వాడికి చెప్పవే అని పార్వతి అంటుంది. చెప్పాల్సింది వాడికి కాదు గుణ గాడికి అని గుణతో మాట్లాడేందుకు వెళ్తానని వెళ్తుంది మీనా.

మరోవైపు దినేష్‌ను దివ్యతో పాటు కలుస్తుంది రోహిణి. చింటు దగ్గరికి వెళ్లడంపై, తన కొడుకు జోలికి వస్తే ఊరుకోను అని రోహిణి ఫైర్ అవుతుంది. నీ భవిష్యత్తు నా చేతుల్లో ఉందని దినేష్ అంటే.. ఎంత కావాలో చెప్పమని విద్య అడుగుతుంది. ఇక ఫైనల్‌గా సెటిల్‌మెంట్ చేసుకుంటాను. 30 లక్షలు ఇవ్వు అని డిమాండ్ చేస్తాడు దినేష్. అంత డబ్బు ఇవ్వలేను. కావాలంటే జాబ్ ఇప్పిస్తానని రోహిణి అంటుంది.

నెల జీతం వచ్చేదాక వెయిట్ చేయలేనని దినేష్ ...