Hyderabad, ఆగస్టు 21 -- గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఈరోజు అంటే 493వ ఎపిసోడ్ మొత్తం బాలు కోసం మీనా నాటుమందు తేవడం, అది కాస్తా ప్రభావతి తీసుకోవడం, ఆ తర్వాత మీనాకు కొత్త కష్టం రావడం చుట్టే తిరిగింది. బాలును మార్చుకోవాలన్న మీనా ప్లాన్ అడ్డం తిరుగుతుంది.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ గురువారం (ఆగస్టు 21) ఎపిసోడ్ మీనాను గుణ అవమానించే సీన్ తో మొదలవుతుంది. మీ ఆయన గురించే ఊరంతా మాట్లాడుకుంటున్నారు.. టీవీల్లోనూ చూపిస్తున్నారు.. ఇక మీదట ఇలా తాగొద్దు.. తాగినా కారు నడిపొద్దు అని ఆయనకు చెప్పు.. ఎంతైనా ఆయన బాగోగులు చూసుకోవాల్సింది నువ్వే కదా.. ఇప్పుడు చూడు ఆయన కారు లాక్కొని ఏ సంపాదన లేకుండా చేశారు..

ఇక నువ్వే సంపాదించాలి.. వెళ్లి ఆ పని చూసుకోపో అంటూ గుణ చాలా అవమానకరంగా మాట్లాడి వెళ్లిపోతాడు. ఆ తర్వాత మీనా పూలు ఇవ్వడానికి వెళ్తుంది. అక్కడి వాళ్లు క...